జి.ఓ.342 అమలు చేయాలి
GO No-3 రద్దుపై ప్రభుత్వం వెంటనే రివ్యూ పిటిషన్ వేయాలని, SC, ST అభ్యర్థులకు పూర్తి జీత భత్యాలతో ఉన్నత విద్యాబ్యాసానికి అవకాశం కల్పిస్తున్న GO 342 కొనసాగించాలని, TAC తీర్మానాన్ని చట్టం చేయాలని, గిరిజన ప్రాంతంలో ఉన్న అన్ని రకాల ఉద్యోగ అవకాశాలను స్థానిక గిరిజన అభ్యర్థులతోనే భర్తీ చేయాలనే డిమాండ్తో రాష్ట్రంలోని అన్ని ఐటిడిఎ ఎదుట జులై 13వ తేదీన ధర్నా చేయాలని యుటిఎఫ్ నిర్ణయాల మేరకు ఈరోజు పార్వతీపురం ఐటీడీఏ కార్యాలయం ఎదుట యుటిఎఫ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమం లో జిల్లా ప్రధాన కార్యదర్శి జె.ఏ.వి.ఆర్.కె.ఈశ్వరరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్.మురళీ మోహనరావు, టి.రమేష్, జిల్లా సహాధ్యక్షులు బి.విజయకుమార్, రాష్ట్ర కౌన్సిలర్ కె విజయగౌరి, జిల్లా కార్యదర్శులు కూర్మారావు, k.మురళి గిరిజన సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శి లు శాంతారాం, శ్రీనివాస్లు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు రెడ్డి శ్రీరామమూర్తి, నిమ్మక శ్రీరాములు, మధు, వెంకటనాయుడు, ఏజన్సీ మండలాల భాద్యులు మొత్తం 53 మంది పాల్గొన్నారు నిరసన కార్యక్రమం అనంతరం ఐ.టి.డి.ఏ మేనేజర్ గారికి వినతిపత్రం ఇవ్వటం జరిగింది.
Comments
Comments are closed.