గుంటూరు జిల్లా - సహాయ కార్యక్రమాలు

plrr vmerc
GUNTUR CITY

కోవిడ్ -19 -సహాయ కార్యక్రమాలు

యావత్ ప్రపంచాన్ని స్తంభింపజేసి కష్టజీవులను కడగండ్ల పాల్జేస్తున్న కరోనా వైరస్, కోవిడ్ 19 వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ వల్ల పేద ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు.” సమాజ సంక్షేమంలోనే ఉపాధ్యాయుల సంక్షేమం ఉంటుందని ” విశ్వసించి నిబంధనావళిలో APUTF లక్ష్యాలుగా  “సామాజిక స్పృహను” చేర్చడం జరిగింది. కేవలం వ్రాసుకోవడానికే పరిమితం కాకుండా నిరంతరం ఆచరణలో పెట్టడం UTF కే చెల్లింది. 1974 లో ఆవిర్భవించిన నాటి నుండి నేటివరకు ఎక్కడ ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు, సామాజిక అణచివేత జరిగినా ఆదుకోవడానికి మేమున్నామంటూ UTF ముందు పీఠిన నిలిచి అందరికీ మార్గదర్శకంగా ఉంటుంది. నిజంగా మన కాలంలో UTF గమనంలో ఇది ఒక చరిత్రే. ఎవరి బలవంతం లేకుండా ఎవరికివారు ముందుకు వచ్చి సహాయ కార్యక్రమాలు నిర్వహించడానికి ఆర్ధిక సహాయ, సహకారాలు అందించడంతో పాటు, కార్యక్రమాలు  నిర్వహించడంలో భాగస్వాములవుతున్నారు. ఎంతటి అపార నమ్మకం. UTF కు ఇచ్చే ప్రతి రూపాయికి లెక్క ఉంటుందని, ప్రతి పైసాకు లెక్క చెబుతారని అపారమైన విశ్వాసం మరొక్కసారి నిరూపితమైంది. కేవలం ఉపాధ్యాయులు మాత్రమే కాదు. వివిధ రంగాల ఉద్యోగులు, కార్మికులు, రైతులు, వ్యాపారులు స్వచ్ఛంగా ముందుకు వచ్చి మావంతు ఈ విరాళం అంటూ ఇవ్వడం ఒక అద్భుతం.

 రాష్ట్ర సంఘం ఇచ్చిన పిలుపు మేరకు గుంటూరు జిల్లాలో ప్రారంభించిన ఈ కార్యక్రమం మార్చి 31న ప్రారంభమై కేవలం నగదు రూపంలో ఇప్పటివరకు 34 లక్షల రూIIలు విరాళాలు సేకరించి, నిరాటంకంగా కార్యక్రమాలు నడుపుతూ ముందుకు సాగుతుంది.

ఈ కార్యక్రమాల్లో భాగస్వాములవుతున్న వారందరికీ అభినందనలు తెలియచేశారు.

పూర్తి సమాచారం:Download

/ Guntur

Share the Post

About the Author

Comments

Comments are closed.

PHP Code Snippets Powered By : XYZScripts.com