మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ప్రాతినిధ్యం
రవాణా మరియు సమాచార శాఖామాత్యులు గారికి వినతి
పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీ సిపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, పదకొండవ పిఆర్సీ ని అమలు చేయాలని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని కోరుతూ మన రాష్ట్ర రవాణా మరియు సమాచార శాఖామాత్యులు శ్రీ పేర్ని వెంకట్రామయ్య (నాని) గారికి 15.06.2020 ఉదయం 10గం.లకు ఆయన నివాసం వద్ద కలసి యు.టి.ఎఫ్.కృష్ణా జిల్లా శాఖ తరపున వినతి పత్రం సమర్పించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు జె. లెనిన్ బాబు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె.ఎ.ఉమామహేశ్వర రావు, జిల్లా నాయకులు టి.వి.రఘుకాంత్, జిల్లా కార్యదర్శి సిహెచ్.రాజా శ్రీధర్, జిల్లా కార్యవర్గ సభ్యులు అబ్దుల్ వహీద్, మచిలీపట్నం టౌన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జె.శ్రీనివాస రావు, కె. వేంకటేశ్వర రావు, మచిలీపట్నం ప్రధాన కార్యదర్శి జె. ప్రసాద రావు, కార్యకర్తలు శివకుమార్ తదితరులు హాజరైనారు.
Comments
Comments are closed.