మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ప్రాతినిధ్యం
11వ పిఆర్సీ అమలుకు సహకరించండి…
ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు యుటిఎఫ్ నేతల వినతి…
రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీని అమలు పరచడానికి చర్యలు తీసుకోవాలని, పదకొండవ పిఆర్సీ అమలుకు సహకరించాలని, సి పి ఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని తిరుపతి రూరల్ యుటిఎఫ్ (ఉపాధ్యాయ) అధ్యక్ష, కార్యదర్శులు బివి రమణ, నాగరాజు రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు అవనిగడ్డ పద్మజ లతో కూడిన ప్రతినిథి బృందం ఆదివారం సాయంత్రం చంద్రగిరి శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, శాసన మండలి సభ్యులు యండపల్లి శ్రీనివాసులురెడ్డి లకు వినతిపత్రం సమర్పించారు.
16వ తేదీ నుంచి మండలి, శాసనసభ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో తమ సమస్యలను పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేశారు. శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎంఎల్ సి యండపల్లి శ్రీనివాసులు రెడ్డిలు స్పందిస్తూ ఉపాధ్యాయులకు మేలు జరిగేట్టుగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తో మాట్లాడుతామని, చట్ట సభలలో ప్రస్తావిస్తామని ఉపాధ్యాయ ప్రతినిధి బృందానికి హామీ ఇచ్చారు.
Comments
Comments are closed.