మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ప్రాతినిధ్యం
పెడన 13.06.2020
యు.టి.ఎఫ్.రాష్ట్ర సంఘం పిలుపు మేరకు పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీ సిపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, పదకొండవ పీఆర్సీ ని అమలు చేయాలని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని కోరుతూ పెడన నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ జోగి రమేష్ గారికి యుటిఎఫ్ కృష్ణా జిల్లా శాఖ తరఫున మెమోరాండం ఇవ్వడం జరిగింది. జిల్లా అధ్యక్షులు జె.లెనిన్ బాబు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె.ఎ.ఉమామహేశ్వర రావు, రాష్ట్ర కౌన్సిలర్ శ్రీ షౌకత్ హుస్సేన్, జిల్లా కార్యవర్గ సభ్యులు అబ్దుల్ వహీద్, పెడన, మచిలీపట్నం, కృత్తివెన్ను మండల ప్రదాన కార్యదర్శులు టి.నాగేశ్వరరావు, జె.ప్రసాదరావు, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర రావు, కార్యకర్తలు కె. రంగనాథ్, శ్రీ సుధాకర్, శ్రీ ఫణి కుమార్ తదితరులు హాజరైనారు.
Comments
Comments are closed.