మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ప్రాతినిధ్యం
పాణ్యం, కోడుమూరు మరియు కర్నూలు 13.06.2020
రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు { (1).CPS రద్దు, (2). PRC అమలు} వెంటనే అమలు చేసేలా చర్యలు తీసుకొనేందుకు ఈ నెల 16 నుండి జరగబోయే బడ్జెట్ సమావేశాల్లో ప్రస్తావించి సహకరించాల్సిందిగా రాష్ట్ర కమిటీ తరఫున పాణ్యం, కోడుమూరు మరియు కర్నూలు శాసన సభ్యులు శ్రీయుతులు కాటసాని రాంభూపాల్ రెడ్డి, డా॥జె.సుధాకర్ మరియు హఫీజ్ ఖాన్ గార్లకు వినతి పత్రాలు ఇవ్వటం జరిగింది. ప్రతినిధి బృందంలో సంఘ రాష్ట్ర కార్యదర్శి కె.సురేష్ కుమార్ , జిల్లా ప్రధానకార్యదర్శి జె.సుధాకర్ , జిల్లా గౌరవాధ్యక్షులు ఏ.ఎం.డి.రఫిక్ , జిల్లా కోశాధికారి జి.హేమంత్ కుమార్ , జిల్లా కార్యదర్శి ఎస్ .ఇబ్రహీం, జిల్లా ఆడిట్ కమిటీ కన్వీనర్ సి.హెచ్ .చిన్నవీరారెడ్డి, రాష్ట్రకౌన్సిలర్ యు.ఆర్ .ఏ.రవికుమార్, జిల్లా కార్యవర్గసభ్యులు ఏ.టి.తిమ్మన్న, ఎం.మారెప్ప, పి.భాస్కర్, ఎం.హనుమంతు తదితరులున్నారు.
Comments
Comments are closed.