కోవిడ్ – 19 – సేవా కార్యక్రమాలు
పలమనేరు యుటిఎఫ్ డివిజన్ సహకారంతో కర్ణాటక, ఆంధ్ర బోర్డర్ అయిన నంగిళి సరిహద్దులో వలస కార్మికులకు, డ్యూటీలు నిర్వర్తిస్తున్న పోలీసులకు, ఉదయం టిఫన్ మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం ఏర్పాటు చేయడమైనది. పలమనేరు స్లమ్ ఏరియాలో ఉన్న నిరుపేదలకు, ప్రభుత్వ ఆసుపత్రిలలో ఉన్న పేషంట్లకు, సహాయకులకు భోజనాలు ఏర్పాటు చేయడమైనది.
ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ సీనియర్ నాయకు ఎన్. సోమచంద్రారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి జి.వి. రమణ, జిల్లా కార్యదర్శి సి.పి.ప్రకాష్, డివిజన్ కన్వీనర్ ఎ.క్రిష్ణమూర్తి, కో కన్వీనర్ ఆర్.ఎం.రాజ, నాయకులు హరిక్రిష్ణ, ప్రసన్న కుమార్, పి.సి.బాబు, రామ్మోహన్, మురళి క్రిష్ణ, గౌస్‌బాషా, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
పమనేరు చుట్టు ప్రక్కల గల షికారి కానీ, నీలకుంట, మబ్బువారిపేట, మేలుమాయి, ప్రభుత్వ ఆసుపత్రి, గంటావూరు కాలనీ తదితర ప్రాంతాల్లో కొన్ని రోజుల పాటు భోజనా సరఫరా, కూరగాయలు, నిత్యావసర వస్తువులు పంపిణీ, శానిటైజర్లు, మాస్కులు వితరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది.
Comments
Comments are closed.