పశ్చిమగోదావరి జిల్లా – సేవా కార్యక్రమాలు

IMG-20200506-WA0136

కరోనా -19 – సేవా కార్యక్రమాలు

కోవిడ్ -19 కారణంగా ప్రభుత్యాలు బడుగు జీవుల అవసరాలను పరిగణ లోనికి తీసుకోనకుండా  లాక్ డౌన్ విధించడంతో రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబాలకు రోజు వారి పని లేక తినడానికి తిండి లేని పరిస్తితులలో అధ్యయనం – అద్యాపనం – సామాజిక స్పృహ కలిగిన యుటిఎఫ్  శ్రమ జీవులను ఆదుకొవాలని భావించింది.  

         యుటిఎఫ్  రాష్ట్ర కమిటి యుటిఎఫ్  వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి అమరజీవి అప్పారి వెంకట స్వామి వర్ధంతి మార్చి  21 తేదీ  నుండి యుటిఎఫ్  రాష్ట్రం లోని అన్ని కమిటీలు శ్రమ జీవులను ఆడుకోవడానికి సేవాకార్యక్రమాలు చేయాలని పిలుపు నివ్వడం జరిగింది.

          రాష్ట్ర కమిటి పిలుపులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లలో సేవాకార్యక్రమాలు సామాజిక స్పృహతో ఉద్యమ స్పూర్తితో చేయడం జరిగింది. ఇంకా సేవాకార్యక్రమాలు కొనసాగుతున్నాయి.  ఇప్పటికే జిల్లాలో 56 శాఖలకు56 శాఖలు సేవాకార్యక్రమాలు చేస్తున్నాయి.    ది 05.05.2020 నాటికి జిల్లాలో అన్ని శాఖలు  రూ 35, 44 ,493/- విరాళాలు సేకరించారు. విరాళాలు ఇచ్చిన ఉపాద్యాయుల సంఖ్య 3127 మంది.సేవాకార్యక్రమాలలో పాల్గొన్నవారి సంఖ్య:960 .నిత్యావసర సరుకులు అందు కున్న కుటుంబాల సంఖ్య 15022 , వ్యక్తుల బోజన పాకెట్స్ 10195 మందికి పంపిణి చేయడం జరిగింది. మజ్జిగ పాకెట్స్, సానిటిజేర్స్ , మాస్క్లు , అరటి పండ్లు , బిస్కెట్ పాకెట్స్, టిఫిన్ పాకెట్స్  మొదలగునవి  9512  మందికి పంపిణి చేయడం జరిగినది .  వెరసి మొత్తం కుటుంబాలు మరియు వ్యక్తులు కలిసి మొత్తం 34729.

సేవాకార్యక్రమాలు :  బియ్యం, పప్పులు, నూనె, గోధుమ పిండి, ఉప్మా రవ్వ, బెల్లం, పంచదార  మొదలగు నిత్యావసర సరుకులు, కూరగాయలు, ఫ్రూట్స్, మజ్జిగ పాకెట్స్, సానిటిజేర్స్ , మాస్క్లు , అరటి పండ్లు , బిస్కెట్ పాకెట్స్, టిఫిన్ పాకెట్స్ .

లబ్ది పొందినవారు:-  వ్యవసాయ కూలీలు, రిక్షా కార్మికులు, ఆటో కార్మికులు, బజారు జుట్టు వారు, ఇండ్లలో పని చేసే వారు, వలస కార్మికులు, బెగ్గర్స్, వికలాంగులు, వితంతువులు, నిరుపేదలు.

విరాళాలు :

కోవిడ్ -19 సేవాకార్యక్రమాలు నిర్వహించడానికి రాష్ట్ర అధ్యక్షులు  శ్రీ షేక్ సాబ్జి గారి కుటుంబము అత్యదికముగా  రూ. 55 వేల రూపాయలు ఇచ్చియున్నారు. సాబ్జి గారికి,వారి కుటుంబం నకు  యుటిఎఫ్ పశ్చిమ గోదావరి జిల్లా కమిటి  ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదే విధంగా జిల్లాలో అత్యధికముగా పాలకొల్లు మండల శాఖ 1,80,600 రూపాయలు, ఉంగుటూరు మండల శాఖ 1,50,201  విరాళాలు సేకరించినవి ఈ శాఖ లకు యుటిఎఫ్ పశ్చిమ గోదావరి జిల్లా కమిటి  ప్రత్యేకమైన ఉధ్యమ అభినందనలు తెలియజేస్తున్నాము. 13 శాఖలు లక్ష రూపాయలు  దాటి  విరాళాలు సేకరించినారు . 15 శాఖలు  50 వేలు రూపాయలుపైన  విరాళాలు సేకరించినారు. అతి చిన్న చిన్న శాఖలు ఉదాహరణకు  కుక్కునూరు , వేలేరుపాడు, పోలవరం , కామవరపుకోట లాంటి శాఖలు కూడా వాటి స్థాయికి  మించి కార్యక్రమాలు చేసియున్నారు. అన్ని కమిటీలకు జిల్లా కమిటి ఉద్యమాభినందనలు తెలియజేస్తుంది.

సేవాకార్యక్రమములో కార్యకర్తలు :     రాష్ట్ర అధ్యక్షులు  శ్రీ షేక్ సాబ్జి గారు , స్టంట్స్ వేయించుకున్నాసరే సేవాకార్యక్రమములో జిల్లా అధ్యక్షులు శ్రీ పి. జయకర్ తో పాటు జిల్లా ఆఫీస్ బేరర్స్, రాష్ట్ర కార్యదర్శులు, రాష్ట్ర కౌన్సిలర్స్ తో పాటు ముక్య కార్యకర్తలు అందరు సామాజిక స్పృహతో ఇబ్బందికర పరిస్థితులలో పాల్గొన్నారు. మొత్తంగా 960 మంది యుటిఎఫ్ సైనికులు సేవాకార్యక్రమములో పాల్గొన్నారు.  అందరికీ జిల్లా కమిటి. ఉద్య మాభినందనలు తెలియజేస్తుంది. కోవిడ్-19  ప్రభావంతో సగం జీతమే ఇచ్చినప్పటికీ యుటిఎఫ్   పిలుపు నందుకుని  యుటిఎఫ్  పై నమ్మకంతో ఉదారంగా విరాళాలు  ఇచ్చారు. వారందరికీ, సేవాకార్యక్రమములో పాల్గొన్న యుటిఎఫ్ సైనికులకు, పోటీపడి మరీ విరాళాలు సేకరించడమే కాకుండా పోటీ పడి మరీ సేవాకార్యక్రమాలు చేసిన ప్రతి కమిటికి పేరు పేరున యుటిఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శ్రీ పి. జయకర్, శ్రీ  బి. గోపి మూర్తులు ఉద్యమాభినందనలు తెలియజేశారు.

పూర్తి సమాచారం:Download

/ West Godavari

Share the Post

About the Author

Comments

Comments are closed.

PHP Code Snippets Powered By : XYZScripts.com