తూర్పుగోదావరి జిల్లా - సేవా కార్యక్రమాలు

U

కరోనా -19 – సేవా కార్యక్రమాలు

కాకినాడ రూరల్‌ మండ శాఖ

కాకినాడ రూరల్‌ తరపున కరోనా బాధితుకు సహాయం కోసం మండం నందలి ఉపాధ్యాయును ఆర్థిక సహాయం కోరడం జరిగింది. ఉపాధ్యాయు దగ్గర నుండి వచ్చిన మొత్తం విరాళాలు రూ.50,000/లుకరోనా వలన ఇబ్బంది పడుతున్న 120 మంది పేద కుటుంబాలను గుర్తించడం జరిగింది. వారిలో 60మంది పేద కుటుంబాలకు ముఖ్యంగా రేషన్‌కార్డు లేని వారికి మొదటి విడతగా సుమారు రూ.309/ విలువగల నిత్యావసర వస్తువులు మరియు 60 మంది పేద కుటుంబాలకు రెండవ విడతగా సుమారు రూ.269/ విలువగల నిత్యావసర వస్తువులు పంపిణీచేయడం జరిగింది.

ఈ కార్యక్రమాన్ని యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి జి.ప్రభాకర వర్మ ప్రారంభించారు. జిల్లా సహాధ్యక్షులు టివివిజిఆర్‌.చక్రవర్తి, జిల్లా కార్యదర్శి నగేశ్‌, మండల గౌరవ అధ్యక్షులు యన్‌.గోవింద రాజు, అధ్యక్షుడు వి.వెంకటరమణ, ప్రధానకార్యదర్శి ఏ.హరి, ట్రెజరర్‌ జి.జగన్నాథరావు, కె.అర్జునరావు, సీనియర్‌ ఉపాధ్యాయులు పర్శా సత్యనారాయణ, యన్‌.త్రినాథరెడ్డి, పి.మధుకుమార్‌, ఆర్‌.వి.వి. సత్యనారాయణ, స్థానిక సి.ఐ.టియు జిల్లా కమిటీ సభ్యులు మెడిసెట్టి వెంకటరమణ, రైతు సంఘం నాయకులు టి.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

కాకినాడ నగరశాఖ

కరోనా బాధితులకు సహాయం కోసం మునిసిపాలిటీ పరిధిలో పనిచేస్తున్న మునిసిపల్‌ ఉపాధ్యాయులు 147 మంది నుండి రూ.1,27,122/లు, ఎయిడెడ్‌ ఉపాధ్యాయులు 15మంది నుండి రూ.14,517/లు, ప్రభుత్వ ఉపాధ్యాయుల నుండి రూ.2000/లు, ఇతరుల నుండి రూ.500/లు మొత్తం రూ.1,48,639/లు విరాళాలు సేకరించినారు. వాటితో ఉపాధి కోల్పోయిన కార్మికులకు, పేద విద్యార్థుల తల్లిదండ్రులకు, వయోవృద్ధులకు, నిరుపేద బ్రాహ్మణులకు, దివ్యాంగులకు 7 విడతలుగా సహాయాన్ని అందించారు. సుమారు 500 మంది కుటుంబాలను ఆదుకుని యుటిఎఫ్‌ ద్వారా పేదలకు కొంత ఉపశమనం కలిగించారు.

యుటిఎఫ్‌ రాష్ట్ర గౌరవాధ్యక్షులు కె.యస్‌.యస్‌.ప్రసాద్‌, రాష్ట్ర కార్యదర్శి జి.ప్రభాకరవర్మ సీనియర్‌ నాయకులు కె.సత్తిరాజు సిఐటియు నాయకులు పలివెల వీరబాబు, యుటిఎఫ్‌ జిల్లా కార్యదర్శి బి.ధర్మరాజు, రాష్ట్ర కౌన్సిర్‌ సిహెచ్‌.వి.రమణ, కాకినాడ నగరశాఖ గౌరవాధ్యక్షులు పాలెపు బాబ్జి, అధ్యక్షులు కె.సువర్ణరాజు, ప్రధాన కార్యదర్శి సి.హెఛ్‌. ఆశీర్వాదం, కోశాధికారి కె.యం.కెమూర్తి, ఆడిట్‌ కమిటీ కన్వీనర్‌ సి.బి.యస్‌. ఇమ్మాన్యూయేల్‌, సహాధ్యక్షులు వై.సుభద్ర, మీసాల వెంకటేశ్వరరావు, చ్లగుళ్ల సుబ్బారావు, జోగా అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

పూర్తి సమాచారం:Download

/ East Godavari

Share the Post

About the Author

Comments

Comments are closed.

PHP Code Snippets Powered By : XYZScripts.com