నెల్లూరు జిల్లా -సేవా కార్యక్రమాలు

where can i buy prednisone for dogs 20 www.georgedermatology.com/medical-dermatology/prednisone/
2 Nlr Dist

కోవిడ్-19-సేవా కార్యక్రమాలు

లాక్‌ డౌన్‌ కారణంగా దినసరి కూలీలు, పనులు లేక రెక్కాడితే గాని డొక్కాడని పేద ప్రజలు, గిరిజనలు, బడుగు, బహీన వర్గాల, పరిశ్రమలు మూతపడటంతో పని కోల్పోయిన తాత్కాలిక ఉద్యోగులు, ఉపాధి కోల్పోయి జీవనం గడపలేని గడ్డు స్థితిలోని పేదలకు మనవంతు సహకారం అందించాలని యుటిఎఫ్‌ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా, మండల కమిటీలు సేవా కార్యక్రమాలు అందుకున్నాయి. జిల్లా వ్యాప్తంగా అనేక మంది కార్యకర్తలు, ఉపాధ్యాయులు ఇందులో పాలుపంచుకున్నారు. రాష్ట్ర, జిల్లా నాయకత్వం జిల్లా కేంద్రం నుంచి నిరంతరం ఫాలోఅప్‌ చేస్తూ శాఖను ప్రోత్సహించడం జరిగింది.
జిల్లా శాఖ తమ వాట్సాప్ గ్రూపులో విరాళాలను ప్రకటించమని కోరిన వెంటనే 49 మండల శాఖలలో దాదాపు మూడు వేల మంది కార్యకర్తలు, సభ్యులు, సానుభూతిపరులు, సీనియర్‌ కార్యకర్తలు స్వచ్ఛందంగా 30 లక్షల రూపాయలు విరాళాలు ఇచ్చారు. ఇందులో అత్యధిక సంఖ్యలో మహిళలు ఉండడం విశేషం. సామాజిక చైతన్యం కలిగిన కార్యకర్తలు ఉన్నారు అనడానికి ఇదే నిదర్శనం.

ఈ మహా యజ్ఞంలో నెల్లూరు రూరల్‌, నగర శాఖలో దాదాపు నాలుగు లక్షలకు పైగా విరాళాలు సేకరించాయి. వెంకటగిరి, బుచ్చి, సూళ్లూరుపేట, నాయుడుపేట కేంద్రాలో మండలాలు సంయుక్తం గా, ప్రాంతీయంగా కార్యక్రమాలు చేశాయి. దాదాపు రెండు లక్షల వంతున విరాళాలు సేకరించాయి. కోట, గూడూరు, పొదలకూరు, నెల్లూరు, ఆత్మకూరు, ఉదయగిరి, వింజమూరు, కావలి ప్రాంతీయ కేంద్రాలలో మండలాల వారీగా కార్యక్రమాలు చేశాయి. దాదాపు 50 వేల వంతున విరాళాలు సేకరించారు.
15 రకాల నిత్యావసర సరుకులు, బియ్యం, కూరగాయలు, మాస్కులు, జిల్లాలో దాదాపు 400 గ్రామాల్లో ఎనిమిది వేల పేద కుటుంబాలకు పంపిణీ చేయడం జరిగింది. కొన్ని ప్రాంతాలలో భోజనం పంపిణీ చేయడం జరిగింది. కరోనా పట్ల వారికి అవగాహన కల్పిస్తూ మీటింగ్‌ నిర్వహించారు. కొన్ని ప్రాంతాల్లో కరపత్రాలు పంచారు. ఈ సేవా ఉద్యమంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ వి.బాలసుబ్రహ్మణ్యం గారు, రాష్ట్ర కార్యదర్శి కె.పరంధామయ్య గారు, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎన్‌.నవకోటేశ్వరరావు, కె.తులసి రాంబాబు గారు, జిల్లా సిఐటియు, డి.వై.యఫ్‌.ఐ., వ్యవసాయ కార్మిక సంఘం, ఎల్‌ఐసి, జనవిజ్ఞాన వేదిక నాయకులు మరియు మండల అభివృద్ధి అధికారులు, మండల రెవెన్యూ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు, మున్సిపల్‌ కమిషనర్లు, పోలీస్‌ డిపార్ట్మెంట్‌ వారు పాల్గొనడం జరిగింది. పైవారందరూ సేవా కార్యక్రమాలు చేస్తున్న యు.టి.ఎఫ్‌ సంఘాన్ని అభినందించడం జరిగింది.

పూర్తి సమాచారం:Download

/ Nellore

Share the Post

About the Author

Comments

Comments are closed.

PHP Code Snippets Powered By : XYZScripts.com