విద్యావిధానంపై సర్వే
కాళ్ళ: కోవిడ్ 19 వ్యాప్తి ఉదృతంగా ఉన్న నేపథ్యంలో విద్యావ్యవస్థ భవిష్యత్ ప్రణాళిక సంధిగ్ధంలో పడింది. దీనిని అధిగమించడానికి సామాజిక స్పృహ ఒక నినాదంగా ఉన్న ఉపాధ్యాయ ఉద్యమ సంఘం ఏపి యుటియఫ్ ఉపాధ్యాయ, కార్యకర్తలతో తల్లిదండ్రుల అభిప్రాయ సేకరణా సర్వేను రాష్ట్ర వ్యాప్తంగా గత రెండు రోజులుగా చేస్తుంది. ఈ సర్వే రిపోర్టును తన బాధ్యతగా సంఘం ప్రభుత్వానికి నివేదించనుంది. ఇందులో తల్లిదండ్రుల స్పార్ట్ ఫోన్స్ అందుబాటు, పాఠశాల తెరవడంపై వారి అభిప్రాయం, సూచనలు వగైరా అంశాలు సర్వేలో నమోదు చేస్తారు. ఈ సందర్భంగా ఏపి యుటియఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.గోపీమూర్తి, జిల్లా కార్యదర్శి సిహెచ్. పట్టాభిరామయ్య మరియు కాళ్ళ మండల శాఖ ఆధ్వర్యంలో పెద అమిరం గ్రామం నుండి ఈ సర్వే ప్రారంభించారు.
సిహెచ్. పట్టాభిరామయ్య సర్వే విశేషాలు ఉపాధ్యాయులకు వివరించారు. బి.గోపీ మూర్తి పలు కుటుంబాలను సందర్శించి సర్వే చేశారు. భౌతిక దూరం పాటిస్తూ సర్వే చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాళ్ళ యుటియఫ్ అధ్యక్షులు జి.రామ కృష్ణంరాజు, ప్రధాన కార్యదర్శి టి.సురేష్, ముఖ్య నాయకులు కె.సత్య నారాయణ, పి. శ్రీరామకృష్ణ, కె.ఎస్.రవి, చంద్రకుమార్, కె.రామ్మూర్తిరాజు, యం.శంకర్రావు, యం. వీరేశలింగం లు పాల్గొన్నారు.
Comments
Comments are closed.