జూలై 13న,జూలై 15 న

WhatsApp Image 2020-07-09 at 9.01.08 PM

జూలై 13న,జూలై 15 న

GO No 3 మరియు GO No 342 కొనసాగింపు కోసం సీతంపేట ITDA వద్ద జూలై 13న, DEO కార్యాలయం శ్రీకాకుళం వద్ద జూలై 15 న UTF ఆధ్వర్యంలో ధర్నాలు.


గురువారం (09.07.2020) UTF జిల్లా కార్యాలయం శ్రీకాకుళంలో UTF శ్రీకాకుళం ప్రాంతీయ సమావేశం జిల్లా సహాధ్యక్షులు B ధనలక్ష్మి అధ్యక్షతన జరిగింది. సమావేశంలో గిరిధర్, అప్పారావు మాట్లాడుతూ నాడు – నేడు ను విజయవంతం చేసేందుకు ఉపాధ్యాయులంతా మంచి కృషి చేస్తున్న నేపధ్యంలో ప్రధానోపాధ్యాయులపై మానసిక ఒత్తిడిని తొలగించాలనీ, మెమోలను ఉపసంహరించాలనీ డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ స్పందించి జోక్యం చేసుకోవాలని కోరారు.
గిరిజన ఉపాధ్యాయుల నియామకం, ప్రమోషన్లకు సంబంధించిన GO No 3 పై రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలనీ, GO No 3 ని కొనసాగించాలని., SC, ST ఉపాధ్యాయులు పదోన్నతికి అర్హతలు పొందేందుకు నిర్ధేశించిన GO No 342 ను కొనసాగించాలని కోరుతూ జూలై 13న సీతంపేట ITDA కార్యాలయం వద్ద, జూలై 15 న DEO కార్యాలయం వద్ద UTF ఆధ్వర్యంలో జరుగనున్న నిరసన కార్యక్రమాలకు ఉపాధ్యాయులు హాజరై విజయవంతం చేయాలని గిరిధర్, అప్పారావు విజ్ఞప్తి చేశారు.
సమావేశంలో UTF రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యులు S కిషోర్ కుమార్, జిల్లా కార్యదర్శులు Y ఉమాశంకర్, H అన్నాజీరావు, B రవి కుమార్, ఎచ్చెర్ల మండల నాయకులు B. క్రాంతి కుమార్, విశ్వనాథం, లావేరు మండల నాయకులు రెడ్డి త్రినాథరావు, P పోలినాయుడు తదితరులు పాల్గొన్నారు.

/ Srikakulam

Share the Post

About the Author

Comments

Comments are closed.

PHP Code Snippets Powered By : XYZScripts.com