మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ప్రాతినిధ్యం

org www
WhatsApp Image 2020-06-14 at 7.11.11 PM

మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ప్రాతినిధ్యం

సి.పి.యస్ రద్దు చేయండి

యు.టి.ఎఫ్ నెల్లిమర్ల నియోజకవర్గం

నెల్లిమర్ల : గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు సి.పి.యస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని, ఆమేరకు రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రస్తావించి సి.పి.యస్ రద్దుకు సహకరించాలని కోరుతూ ఈరోజు గౌరవ నెల్లిమర్ల శాసనసభ్యులు శ్రీ.బడుకొండ అప్పలనాయుడు గారికి వినతిపత్రం సమర్పించడమైనది. గౌరవ శాసనసభ్యులు వెంటనే సానుకూలంగా స్పందిస్తూ విద్యాశాఖా మంత్రి శ్రీ.ఆదిమూలపు సురేష్ గారితో ఫోన్ లో ఈ విషయమై చర్చించారు. ప్రభుత్వం మానిఫెస్టో లో పేర్కొన్న ప్రతి హామీకి కట్టుబడి ఉందని, సి.పి.యస్ రద్దుకు ప్రభుత్వం నియమించిన మంత్రుల కమిటీ సిఫార్సుల మేరకు త్వరలో ఈ సమస్య ను పరిష్కరిస్తామని మంత్రి గారు తెలియజేసారని గౌరవ శాసనసభ్యులు అన్నారు.

ఈ కార్యక్రమంలో యు.టి.ఎఫ్ జిల్లా కార్యదర్శులు పతివాడ త్రినాధ్, కె.ప్రసాదరావు, సూర్యారావు, నెల్లిమర్ల మండల ప్రధాన కార్యదర్శి మీసాల రామారావు, సి.పి.యస్ కన్వీనర్ కె.శ్రీనివాసరావు, వి.సురేష్ బాబు, భోగాపురం మండల అధ్యక్షులు పి.ప్రసాదరావు, ఈ.రాములప్పడు, సోమేశ్వర రావు, వాసుదేవరావు, రమేష్ పాల్గొన్నారు.

/ Vizianagaram

Share the Post

About the Author

Comments

Comments are closed.

PHP Code Snippets Powered By : XYZScripts.com