మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ప్రాతినిధ్యం
బొబ్బిలి (13.06.2020) : యూటీఎఫ్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు సిపియస్ రద్దు, PRC అమలు ఈ రెండు అంశాలపై రాబోయే అసెంబ్లీ సమావేశాలలో తగు నిర్ణయం తీసుకోవాలని కోరుతూ బొబ్బిలి నియోజక శాసన సభ్యులు శ్రీ శంబంగి.వెంకట చిన అప్పలనాయుడు గారికి యూటీఎఫ్ రాష్ట్ర నాయకులు విజయ గౌరి గారి ఆధ్వర్యంలో వినతిపత్రాన్ని అందచేస్తున్న బొబ్బిలి డివిజన్ యుటియఫ్ నాయకులు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిలర్ ప్రసన్న కుమార్, జిల్లా కార్యదర్శి కేశవరావు, జిల్లా నాయకులు మధుసూదనరావు, బొబ్బిలి మండల ప్రధాన కార్యదర్శి పకీరు నాయుడు, బొబ్బిలి పట్టణ శాఖ ప్రధానకార్యదర్శి చిట్టి బాబు, సహాధ్యక్షులు శారదా, మండల నాయకులు మురళి, వెంకట నాయుడు, వెంకట రమణ, కృష్ణ, కృష్ణదాసు పాల్గొన్నారు.
Comments
Comments are closed.