మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ప్రాతినిధ్యం

WhatsApp Image 2020-06-13 at 7.20.28 PM

మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ప్రాతినిధ్యం

విజయనగరం 13.06.2020

UTF రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఎన్నికల్లో హామీ ఇచ్చిన సి పి ఎస్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ అమలు చేయమని మరియు పి ఆర్ సి అమలు చేయవలెనని త్వరలో జరుగనున్న అసెంబ్లీ సమావేశాల్లో చర్చించమని కోరుతూ స్థానిక విజయనగరం  శాసనసభ్యులు శ్రీ కోలగట్ల వీరభద్ర స్వామి గారిని 13.06.2020న  సాయంత్రం కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని వెంటనే ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి, CPS రద్దు మరియు PRC అమలుకు కృషి చేస్తానని శాసన సభ్యులు చెప్పడం జరిగింది.

ఈ కార్యక్రమంలో UTF రాష్ట్ర కార్యదర్శి కె.శేషగిరి, జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు రమేష్ చంద్ర పట్నాయక్, JAVRK ఈశ్వరరావు, జిల్లా కార్యదర్శి సి.హెచ్. కృష్ణం నాయుడు,రాష్ట్ర కౌన్సిలర్  కె.శ్రీనివాసరావు, ఆడిట్ కమిటీ మెంబెర్ GVV ప్రసాద్, విజయనగరం మండల ప్రధాన కార్యదర్శి పి. రామకృష్ణ, సహ అద్యక్షుడు కె.రాజేష్, జిల్లా కౌన్సిల్ సభ్యులు ఎమ్. లవకుమార్, కార్యకర్తలు సతీష్, పారినాయుడు,సత్యనారాయణ పాల్గొన్నారు.

/ Vizianagaram

Share the Post

About the Author

Comments

Comments are closed.

PHP Code Snippets Powered By : XYZScripts.com