మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ప్రాతినిధ్యం
సూళ్ళూరుపేట 13.06.2020
సూళ్ళూరుపేట ఈనెల 16 వతేదీ నుండి జరుగనున్న అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం CPS ను రద్దుచేసి, పాతపెన్షన్ విధానాన్ని అమలు చేయుటకు, 11 వ PRC అమలుకు తగిన నిర్ణయాలు తీసుకొనుటకు కృషి చేయాలని తే 13-06-2020 దిన సూళ్ళూరుపేట శాసన సభ్యులైన కిలివేటి సంజీవయ్య గారిని కలిసి వినతి పత్రం అందజేయడమైనది.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు యన్.నవకోటేశ్వర రావు, కె.తులసీరాంబాబు,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జి.వి.చలపతిశర్మ, జిల్లా కార్యదర్శి కె.నాగిరెడ్డి,రాష్ట్ర కౌన్సిలర్ డి.గోపాల్ మరియు నెల్లూరు రూరల్, టిపి గూడూరు మండల బాధ్యులు పాల్గొన్నారు.
Comments
Comments are closed.