ప్రాంతీయకార్యాలయంలో కార్యకర్తల సమావేశం

WhatsApp Image 2020-06-09 at 6.20.20 PM

ప్రాంతీయకార్యాలయంలో కార్యకర్తల సమావేశం

నాడు-నేడు పాఠశాలల ప్రధానోపాధ్యాయులపై ఒత్తిడి తగదు

2020 జున్ 9, ఎమ్మిగనూర్ ప్రాంతీయకార్యాలయంలో కార్యకర్తల సమావేశం :

నాడు-నేడు కింద ఎంపికైన జిల్లాలోని 1101 పాఠశాల ప్రధానోపాధ్యాయులపై రాజకీయనాయకుల ఒత్తిడి తగదని UTF రాష్ట్రకార్యదర్శి కె.సురేష్ కుమార్, జిల్లా అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు జె.యల్లప్ప, జె.సుధాకర్ పేర్కోన్నారు. ఎమ్మిగనూర్ ప్రాంతీయకార్యాలయంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా సురేష్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలోమౌలికవసతుల కల్పనకు జిల్లాలో మొదటి విడతలో 1101పాఠశాలలో ఎలక్ట్రికల్ వస్తువులు,స్టీలు,సీమెంట్ వంటివాటిని ఫలాన షాపులోనే కొనాలని రాజకీయనాయకులు,

A Eలుప్రధానోపాధ్యాయులపై ఒత్తిడి తెస్తున్నారని  మరికొన్ని చోట్ల కొన్న వస్తువులను వెనక్కి ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నారని విమర్శించారు

జిల్లాప్రధాన కార్యదర్శి జె.సుధాకర్ మాట్లాడుతూ కరోనావైరస్ వ్యాప్తికి దోహాదం చేసే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల షూస్ కోరకుపాదాలకొలతలు సేకరించే కార్యక్రమాన్ని వాయిదా వేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

జిల్లా అధ్యక్షుడు జె.యల్లప్ప మాట్లాడుతూ విద్యార్థులకు రెమిడీయల్ టీచింగ్ లోభాగంగారేపటినుండి ప్రారంభమయ్యే బ్రిడ్జికోర్సుల దూరదర్శన్/సప్తగిరి చానల్స్ లో నిర్వహిస్తున్నప్పటికి వారంలో ప్రతి మంగళ,బుధ,శుక్రవారాలు ఉపాధ్యాయులు పాఠశాలలకు హాజరై విద్యార్థుల సందేహాలు తీర్చాలని పేర్కోనడంతో పాఠశాలలు రేపటినుండి ప్రారంభిస్తున్నారా లేక ఆగస్టు 3నుండి ప్రారంభిస్తున్నారనే గందరగోళంలో ఉపాధ్యాయులు వున్నారని పేర్కోన్నారు.

నాడు-నేడు పనులు,ఆన్లైన్లో వెబ్నార్ ఇంగ్లీష్ మీడియం పై ట్రైనింగ్స్, spoken ఇంగ్లీష్ క్లాస్లు ప్రస్తుతం బ్రిడ్జీకోర్సులతో ఉపాధ్యాయులను కరోనా కాలంలో ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తుందని విమర్శించారు.

ఈకార్యక్రమంలో జయరాజు,రవికుమార్,హేమంత్,వేణుగోపాల్,నారాయణ,రాజు,దేవపాల్,రామాంజినేయులు,రాజశేఖర్,లక్ష్మన్న,వివిధ మండలాల నాయకులు,కార్యకర్తలు పాల్గోన్నారు.

/ Kurnool

Share the Post

About the Author

Comments

Comments are closed.