కోవిడ్ – 19 – సేవా కార్యక్రమాలు
యు.టి.యఫ్ ప్రకాశం జిల్లా శాఖ
కోవిడ్ 19, సహాయక కార్యమ్రాలు కరోనాను ఎదుర్కొనేందుకు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన లాక్‌డౌన్ నేపధ్యంలో ఒంగోలులోని గుర్రం జాషువా కాలనీలోని పేదలకు ఆంధ్రప్రదేశ్ ఐక్యఉపాధ్యాయ ఫెడరేషన్ (యు.టి.యఫ్) ప్రకాశం జిల్లా శాఖ ఆధ్వర్యంలో తేది.30.04. 2020న రూ.20,000
లు విలువ చేసే బియ్యం, నూనె, పప్పు 112 కుటుంబాలకు పంపిణీ చేయడమైనది. బయటకు రాకుండా, ఇళ్ళలోనే ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని అక్కడి ప్రజలకు సూచించారు.
ఈ కార్యక్రమంలో యు.టి.యఫ్ రాష్ట్ర కోశాధికారి కె.శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షులు యస్.రవి, గౌరవాధ్యక్షులు డి.వీరాంజనేయులు, జిల్లా కార్యదర్శులు యన్.చిన్నస్వామి, జి.ఉమామహేశ్వరి, యన్.వెంకటేశ్వరరావు, కుటుంబ సంక్షేమ పథక కోశాధికారి యం.శ్రీనివాసురెడ్డి, ఉపాధ్యాయ నాయకులు హరిబాబు, బ్రహ్మయ్య, నరసింహారావు గార్లు పాల్గొన్నారు.
Comments
Comments are closed.