కర్నూలు జిల్లా - సేవా కార్యక్రమాలు

Pattikonda

కోవిడ్ -19- సేవా కార్యక్రమాలు

యుటిఎఫ్‌ ఆదోని డివిజన్‌ ఆధ్వర్యంలో 03/04/2020 వ తేదీన 400 మంది నిరాశ్రయులకు మరియు ప్రభుత్వ హాస్పిటల్‌ లోని రోగులకు వారి అటెండెంట్‌ లకు భోజనం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె.హనుమంతు, జిల్లా కార్యదర్శి కృష్ణమూర్తి మరియు గాదె లింగ, సునీల్‌ రాజ్‌ కుమార్‌, రుద్రముని, రంగన్న పాపయ్య తదితరులు పాల్గొన్నారు.


కరోనా వ్యాప్తి విస్తరించకుండా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి కోల్పోయిన పేదలకు యుటిఎఫ్‌ ఎమ్మిగనూర్‌ డివిజన్‌ శాఖ ఆధ్వర్యంలో 04/04/2020వ తేదిన పట్టణంలోని 17 నిరుపేద కుటుంబాలకు 4వ తేదిన ఉదయం 7 గంటలకు ఎమ్మిగ నూర్‌ ప్రాంతీయ కార్యాలయం దగ్గర నిత్యావసర సరుకుల కిట్లు పట్టణ సి.ఐ. శ్రీధర్‌ గారి చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా సి.ఐ. గారు మాట్లాడుతూ ఉపాధి కోల్పోయిన పేదలకు సహాయం చేయాలనే ఆలోచన గొప్పదని సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న యుటిఎఫ్‌ ఉపాధ్యాయ సంఘానికి అభినందను తెలియ చేశారు.

పూర్తి సమాచారం:Download

/ Kurnool

Share the Post

About the Author

Comments

Comments are closed.

PHP Code Snippets Powered By : XYZScripts.com