కరోనా -19 – సేవా కార్యక్రమాలు

1

కరోనా -19 – సేవా కార్యక్రమాలు

సామాజిక సేవలో యుటిఎఫ్ శ్రీకాకుళం

"కరోనా మహమ్మారి" విజృంభిస్తున్న ఈ సమయంలో సామాజిక స్పృహ గల యుటిఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు శ్రీకాకుళం జిల్లాలో లాక్ డౌన్ వలన ఉపాధి కోల్పోయిన వారికి,రెక్కాడితే గాని పేద కుటుంబాలకు సహాయం అందించేందుకు 50% జీతం తగ్గినప్పటికీ "బడిలో పాఠాలు చెప్పడమే కాదు పేదలకు అండగా ఉంటామని" యుటిఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నిరూపించారు. COVID19 వైద్యఅవసరాలకు యుటిఎఫ్ జిల్లా కార్యాలయం ను వాడుకోవాలిఅని ప్రభుత్వం అంగీకారం తెలిపిన విషయం విదితమే. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 1975 మంది దాతలు నుండి రూ 19,26,067/-లు (తేదీ 29-4-20నాటికి) విరాళాలు సేకరించడానికి 570 మంది కార్యకర్తలు కృషి చేశారు. 38 మండల పరిధిలో 41 శాఖలు మండల /పట్టణ శాఖలు, 428 గ్రామాలు, 15 వార్డులు, 67 కాలనీల్లో, మొత్తంగా 6398 కుటుంబాలకు ఉపాధ్యాయుల తరఫున నిత్యావసర సరుకులు, మాస్కులు,భోజనం పాకెట్లు,శానిటైజర్స్ అందించారు. 

విరాళాలు అందించిన ఉపాధ్యాయులు,దాతలు, నాయకులు, కార్యకర్తలకు యుటిఎఫ్ ఉద్యమ జేజేలు.. 
యూటీఎఫ్ శ్రీకాకుళం జిల్లా శాఖ ఆధ్వర్యం లో తేది29.4.2020 నాటికి కరోనా (COVID19) లాక్డౌన్ వలన పనులు లేక ఇబ్బందులు పడుతున్న రెక్కాడితేగాని డొక్కాడని కుటుంబాలకు చేసిన సేవాకార్యక్రమాలు వివరాలు
1.సేవాకార్యక్రంమాలు చేసిన మండలాలు 38/38, (UTFశాఖలు:41/41) 
2.సేకరించిన విరాళాల మొత్తం: రూ.19,26067/- 
3.విరాళాలు ఇచ్చిన దాతల సంఖ్య: 1975 
4.సేవా కార్యక్రమాలు లో పాల్గొన్న కార్యకర్తలు సంఖ్య.: 570 
5.నిత్యవసర సరుకులు అందుకున్న కుటుంబాల సంఖ్య:. 6398 
6.పంచిన భోజనాల ప్యాకెట్లు సంఖ్య: 426 
7.మాస్కులు, శానిటైజర్స్, పంచిన సంఖ్య.: 2682 

ఈ కార్యక్రమ నిర్వహణకు సహకారం అందించిన ప్రతి ఒక్కరికి ఉద్యమ జేజేలు. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (APUTF)శ్రీకాకుళం జిల్లా. 
/ Srikakulam

Share the Post

About the Author

Comments

Comments are closed.

PHP Code Snippets Powered By : XYZScripts.com