జి.ఒ.342 అమలు చేయాలి
ఏజెన్సీ ప్రాంతంలో జీవో నెంబర్.3 కొనసాగించాలని రాష్ట్రవ్యాప్తంగా యుటిఎఫ్ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు అన్ని ఐటీడిఏలలో ఈరోజు తలపెట్టిన నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అనుమతి నిరాకరించడంతో పాటు అన్ని ప్రాంతాలలో కరోనా విస్తృతంగా ఉన్నందున కొద్దిమందితో నిరసన కార్యక్రమం చేసి గౌరవనీయులు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సీతంపేట వారికి మెమోరాండం ఇవ్వడం జరిగినది.
ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు ఎ.భాస్కరరావు, రాష్ట్ర కౌన్సిలర్ కొండంగి కృష్ణారావు, మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సింహాచలం, కృష్ణారావు, రామారావు, జయ ప్రకాష్ గాసయ్య, ఝాన్సీ, సుమలత,తదితరులు పాల్గొన్నారు.
Comments
Comments are closed.