జి.ఓ.342 అమలు చేయాలి
యుటియఫ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జి.ఓ.3 పునరుద్ధరణకై సుప్రీంకోర్టు రివ్యూ పిటిషన్ వేయుటకు, జి.ఓ.342లోని ఎస్.సి, ఎస్.టి ఉద్యోగుల, ఉపాధ్యాయుల ప్రయోజనాలను పరిరక్షించమని కోరుతూ ముఖ్యమంత్రికి రాసిన వినతి పత్రాన్ని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకట రెడ్డికి ఇవ్వడమైనది.
ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి యం.సుధాకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.వి.వి.రమణయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహమ్మద్ జిలాన్, సీనియర్ నాయకులు సి.కె.నాగేంద్రబాబు లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి పేద ప్రజలకు ఎస్.సి, ఎస్.టి సామాజిక వర్గాలకు వివిధ పథకాల ద్వారా అనేక ప్రయోజనాలు కల్పిస్తున్నారు. అయితే ఇటీవల జి.ఓ.3 చెల్లదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దీనివల్ల గిరిజనుల విద్యకు, ఉపాధికి త్రీవ నష్టం వాటిల్లితుంది. కావున రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని గిరిజనుల ప్రయోజనాలు రక్షించేందుకై ప్రభుత్వం తరపున రివ్యూపిటిషన్ దాఖలు చేయాలని, ఎస్.సి, ఎస్.టి ఉద్యోగులు, ఉపాధ్యాయులు తదుపరి ప్రమోషన్లు పొందుటకు అవసరమైన విద్యార్హతలు సాధించేందుకు 2 సం.ల ఆన్ డ్యూటీపై స్టడీ లీవు పొందే సౌకర్యం జి.ఓ.342, తేదీ.30.08.1977 ద్వారా కల్పించబడింది. కాని దీనిలో ఆన్ డ్యూటీ సౌకర్యాన్ని తొలగించి కేవలం జాతీయ నష్టపు సెలవుపై మాత్రమే స్టడీ లీవు మంజూరు చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మెమో నం.820339 జారీ చేసింది. దీనివల్ల నిరుపేద ఎస్.సి., ఎస్.టి.లు నష్టపోతారు. కావున ఈ మెమోను రద్దుపరచి, జి.ఓ.342ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇదే అంశంపై 15.07.2020న జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెల్పారు.
ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ మీరు ఇచ్చిన వినతిపత్రాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రికి పంపుతానని, విద్యాశాఖా మంత్రితో చర్చించి ఈ మెమో రద్దుకు కృషి చేస్తానని తెల్పారు. ఈ ప్రాతినిధ్యంలో జిల్లా కార్యదర్శి లింగమయ్య పాల్గొన్నారు.
Comments
Comments are closed.