షోకాజ్ మెమోలను వెనక్కు తీసుకోవాలి
నాడు – నేడు పై ప్రధానోపాధ్యాయులకు ఇచ్చిన షోకాజ్ మెమోలను వెనక్కు తీసుకోవాలి : UTF డిమాండ్
కరోనా నేపథ్యంలో తీవ్ర ఇబ్బందులకూ, వత్తిడికీ గురౌతూ కూడా నాడు – నేడు పనులను నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రధానోపాధ్యాయులకు మరింత మానసిక ఒత్తిడికి గురిచేస్తూ జిల్లా విద్యాశాఖాధికారి 399 మంది ప్రధానోపాధ్యాయులకు షోకాజ్ మెమోలు జారీ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు UTF రాష్ట్ర కార్యదర్శి గొంటి గిరిధర్, జిల్లా అధ్యక్షులు పొందూరు అప్పారావు తెలిపారు.
ఈ విషయంపై DRO శ్రీ బలివాడ దయానిధి గారిని కలిసి కలెక్టర్ గారికి తెలియజేయాలని కోరడం జరిగింది. అలానే DEO శ్రీమతి కుసుమ చంద్రకళ గారిని కూడా కలసి షోకాజ్ మెమోలను వెనక్కు తీసుకోవాలనీ, వెనక్కు తీసుకోకపోతే జిల్లా వ్యాప్తంగా నాడు – నేడు కార్యక్రమాన్ని Boycott చేయడానికి కూడా వెనుకాడమని చెప్పడం జరిగింది.
Comments
Comments are closed.