మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ప్రాతినిధ్యం
రాజాం (13.06.2020):
(రాజాం నియోజకవర్గ యూటీఫ్ తేదీ.13/06/2020)
సి పి ఎస్ రద్దు చేయాలని కోరుతూ స్థానిక ఎమ్మెల్యే శ్రీ కంబాల జోగులు గారికి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆంధ్ర ప్రదేశ్ ఐఖ్య ఉపాధ్యాయ ఫెడరేషన్ సభ్యులు వినతి పత్రాన్ని సమర్పించిన స్థానిక ఉద్యోగులు,1980 పెన్షన్ రూల్సును పునరుద్దరిస్తూ కొత్త జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు.ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం కాలం పూర్తి అయ్యింది.ఎన్నికలు ముందు ఇచ్చిన హామీలను మానిఫెస్టోలో అనేక అంశాలు అమలు చేస్తున్నారు.ముఖ్యంగా విద్యాశాఖను తరచుగా రివ్యూ చేయడం సంతోషకరం.విద్యాశాఖ ద్వారా “అమ్మ ఒడి పథకం”,”నాడు – నేడు”, మధ్యాహ్న భోజన పథకంలో మార్పులు పాఠశాలలు అభివృద్ధికి చాలా తోడ్పడుతున్నాయి. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు నియంత్రణకు కమిటీ వేయడం, ఫీజుల నియంత్రణకు చర్యలు తీసుకోవడం ఆహ్వానించదగ్గ విషయం. ఉద్యోగులందరికీ 27శాతం ఐ.ఆర్ ఇవ్వటం అభినందనీయం.కానీ!
మానిఫెస్టోలో ఉద్యోగులకు ఇచ్చిన ప్రధానమైన హామీలు
సి పి ఎస్ రద్దుచేసి పాత పెన్షన్ విధానం పునరుద్ధరించుట,సకాలంలో 11వ పిఆర్సిని అమలు చేయాలని రాజాం అసెంబ్లీ నియోజకవర్గ గౌరవ ఎమ్మెల్యే కంబాల జోగులు గారికి తమ క్యాంప్ కార్యాలయంలో ఆంధ్ర ప్రదేశ్ ఐఖ్య ఉపాధ్యాయ ఫెడరేషన్ సభ్యులు వినతి పత్రాన్ని సమర్పించిన స్థానిక యూటీఫ్ నాయకులు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డి మోహన్ రావు,రాజాం డివిజన్ అధ్యక్షులు జి చంద్రశేఖర్ నాయుడు, నాలుగు మండలాల అధ్యక్షులు కురిటి బాలమురలి కృష్ణ, డి రామారావు, డోల కృష్ణా రావు,వి సత్యం నాయుడు,యస్ సత్యనారాయణ, కె భుజంగరావు,ఎన్ శ్రీరాములు, యస్ బాబురావు, డి వెంకట్రావు, టి అరుణ్ కుమార్ మరియు పి మురళి పాల్గొన్నారు.
Comments
Comments are closed.