మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ప్రాతినిధ్యం
ధర్మవరం జోన్
రాష్ట్ర, జిల్లా యుటిఎఫ్ శాఖల పిలుపుమేరకు ఈ నెల 16వ తేదీ నుండి జరగబోవు శీతాకాలపు అసెంబ్లీ సమావేశాల నందు సి.పి.ఎస్ రద్దు చేయుటకు మరియు 11వ పిఆర్సి వెంటనే అమలు చేయుటకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఈ అంశాలను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాలని ధర్మవరం నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గారికి శుక్రవారం రోజున యుటిఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు శెట్టి పి జయచంద్రారెడ్డి ధర్మవరం జోన్ యుటిఎఫ్ నాయకులు రామకృష్ణ నాయక్, లక్ష్మయ్య, రాంప్రసాద్, హరికృష్ణ, మల్లేష్, అమర్ నారాయణ రెడ్డి, నాగరాజు, రామాంజనేయులు, లక్ష్మీనారాయణ తదితరుల బృందం యుటిఎఫ్ పక్షాన వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ తప్పకుండా ఈ అంశాలను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి సమస్యల సాధనకు కృషి చేస్తానని తెలియజేశారు.
Comments
Comments are closed.