• యుటియఫ్ చేపట్టిన పాఠశాల సర్వే రిపోర్టు మంత్రికి అందజేశారు.

Latest News

మా గురించి

విద్యారంగాన్ని సమైక్యపరిచి అన్ని ప్రాంతాల, అన్ని మేనేజిమెంట్ల, అన్ని కేడర్ల సమైక్య సంఘంగా చారిత్రక అవసరంగా 1974 ఆగస్టు 10న ఏర్పడిన సంస్థ యుటియఫ్‌.
యుటియఫ్‌ స్థాపించిన వెంటనే అత్యవసర పరిస్థితి ఏర్పడినా లెక్కచేయక ఉపాధ్యాయుల పక్షాన నిలిచింది.

రీగ్రూపింగ్‌ స్కేళ్లు, పే స్కేళ్ళు పెంపులదకు, ఎయిడెడ్‌ టీచర్ల డైరెక్ట్‌ పేమెంట్‌ నుండి 60 సం॥కు రిటైర్మెంట్‌ వరకు, మున్సిపల్‌ టీచర్ల జీతాల అక్కౌంట్‌ నుండి 010 వరకు, ఉపాధ్యాయుల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టే కౌన్సిలింగ్‌ జిఓ సాధనతోపాటు అప్రెంటీస్‌ నోషనల్‌ ఇంక్రిమెంట్లు, ఎస్ సి, ఎస్ టి అన్ ట్రైన్డ్ టీచర్ల నోషనల్ ఇంక్రి మెంట్ల సాధన, అప్రెంటిస్‌ విధానం రద్దుకు స్వతంత్రంగాను, సమైక్యంగాను అగ్రభాగాన నిలిచిపోరాడిన సంస్థ యుటియఫ్‌. 2007 తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో యుటియఫ్‌ బలపరిచిన ఎమ్మెల్సీలు 13 జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

నవ్యాంధ్రప్రదేశ్‌లో అగ్రగామి సంఘంగా ఉంటూ ఐక్య ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ ఫ్యాప్టోలో కోచైర్మన్‌ మరియు జెఏసిలో సెక్రటరీ జనరల్‌ బాధ్యులు నిర్వహిస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల హక్కుల సాధనకు కృషి చేస్తున్నది.

కేంద్ర ప్రభుత్వం విద్యారంగానికి కేటాయింపులు తగ్గించటంతో పాటు, విద్యా కాషాయీకరణకు బీజాలు వేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌ పాఠశాలుగా మార్చుతామని ప్రచారం చేస్తూ విద్యారంగం మొత్తం కార్పొరేట్‌ వారికి అప్పగించ బోతుంది. విద్య కార్పొరేటీకరణ, కాషాయీకరణకు వ్యతిరేకంగా ఉపాధ్యాయుల్ని చైతన్యపరచడం, ప్రజలతో కలిసి ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవడమే నేడు మన ప్రధాన కర్తవ్యం.

ఫొటో గ్యాలరీ

PHP Code Snippets Powered By : XYZScripts.com