అర్టికల్స్

where to purchase trimox without rx canadapharmrxon

ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి జరగాలి
జూన్‌ 12 నుండి పాఠశాలల పునఃప్రారంభం కానున్నాయి. పాఠశాలలు ప్రారంభించే వేళలో క్రమబద్ధీకరణ పేరిట పెద్ద సంఖ్యలో పాఠశాలలు మూత పడనున్నాయి. వేసవి సెవులల్లోనే పాఠశాల క్రమబద్ధీకరణ, ఉపాధ్యాయుల సర్దుబాటు, బదిలీలు పూర్తి చేస్తామన్న ప్రభుత్వ ప్రకటన ఆచరణలో విఫలమైంది.
విద్యాహక్కు చట్టం మేరకు బడిఈడు గల బాలబాలికలదరికీ నాణ్యమైన విద్య ఉచితంగా అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. కాని మన రాష్ట్ర ప్రభుత్వం క్రమబద్ధీకరణ పేరుతో విడుదల చేసిన ఉత్తర్వులు వలన 10వేల పాఠశాలలు మూతపడే ప్రమాదం ఉన్నది. 19లోపు విద్యార్ధులున్న 6201 పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలలు గా మారనున్నాయి. 1 కి.మీ. లోపు గల 19లోపు విద్యార్ధులున్న పాఠశాలలు 3778 విలీనం ద్వారా మూతబడనున్నాయి. 40మంది లోపు విద్యార్ధులున్న 2384 ప్రాథమికోన్నత పాఠశాలలు డి గ్రేడ్‌ కాబడి ప్రాథమిక పాఠశాలగా మారనున్నాయి.
పాఠశాలల్లో అవసరాలకు మించి ఉన్న అదనపు పోస్టులను సర్దుబాటు చేయవచ్చుగాని, కొన్ని పాఠశాలలు మూసివేసి, మరికొన్ని పాఠశాలలు డిగ్రేడ్‌ చేసి, ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులపై పని భారం పెంచి, ఉపాధ్యాయ పోస్టులను కృత్రిమంగా మిగులు చూపి సర్దుబాటు చేయడం సమర్ధనీయం కాదు. మరి అవసరమైన పాఠశాలల్లో అదనపు పోస్టులు కల్పించకపోవడం శోచనీయం.
జాతీయ విద్యా విధానం ప్రకారం గాని, విద్యాహక్కు చట్టం ప్రకారం కాని ప్రాథమిక పాఠశాలల్లో కనీసం ఇద్దరు టీచర్లు ఉండాలి. అంతే కాకుండా పాఠశాలల క్రమబద్ధీకరణ అనేది బడిలో చేరిన పిల్లలు సంఖ్య ఆధారంగా కాకుండా ఆవాస ప్రాంతాలలో బడిఈడు గల పిల్లలు సంఖ్య ఆధారంగా నిర్ణయించ బడాలి. బడిఈడు గల పిల్లలుండి , వారు బడిలో చేరకపోతే ప్రభుత్వ బడిలో పిల్లలు చేరకపోవడానికి గల కారణాలు అన్వేషించాలి. వాటి ఆధారంగా సమస్యలు పరిష్కరిస్తే ప్రభుత్వ బడులు బతుకుతాయి.
విద్యాహక్కు చట్టాన్ని సమర్ధవంతంగా అమలు చేయాలనే చిత్తశుద్ధి ఉంటే చట్టంలోని నిబంధన ప్రకారం ప్రైవేట్‌ పాఠశాలను నియత్రించాలి. ప్రభుత్వ పాఠశాలల క్రమబద్ధీకరణకు అనుసరిస్తున్న విధానాన్ని గుర్తింపు పొందిన ప్రైవేట్‌ పాఠశాలలకూ వర్తింపు చేయాలి. ప్రభుత్వ పాఠశాలకు అవసరమైన మౌలిక సౌకర్యాలు కల్పించాలి. పర్యవేక్షణా వ్యవస్థను పటిష్ట పరచాలి. ప్రభుత్వ ఆధీనంలోనే బడిఈడు గల పిల్లలకు ఉచిత విద్య అందించాలనే లక్ష్య దిశగా ప్రభుత్వం అడుగులు వేయాలి. ప్రభుత్వ పాఠశాలల మూసివేతకాదు పాఠశాలల అభివృద్ధి జరగాలనే ఆశయంతో ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వం ముందుకు సాగాలని ఆశిద్ధాం. ఉపాధ్యాయులుగా మన వంతు కర్తవ్యం నిర్వహించుదాం.