Home UTF History Ikya Upadhyaya Magazine News GO's Statements Mahasabhalu Photo Gallery STFI- School Teacher's Federation of India
 
 
 
 
 
 

 

UTF News

స్టెప్‌అప్‌ ఉత్తర్వులు డ్రాయింగ్‌ అధికారులే ఇవ్వాలి : యుటిఎఫ్‌

హైదరాబాద్, 17 ఆగస్టు 2010:
2010 పిఆర్‌సిలో పలు ఉత్తర్వుల్లో పేర్కొన్న విధంగా స్టెప్‌అప్‌, ప్రీపోన్‌మెంట్‌ వర్తించే ఉపాధ్యాయుల ఫిక్సేషన్లు డ్రాయింగ్‌, డిస్బర్సింగ్‌ అధికారులే చేసే విధంగా తగు ఆదేశాలు ఇప్పించాలని ఆర్థిక శాఖ అధికారులకు ఆంధ్రప్రదేశ్‌ ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య (యుటిఎఫ్‌) అధ్యక్షప్రధానకార్యదర్శులు ఎన్‌ నారాయణ, ఐ వెంకటేశ్వరరావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. స్టెప్‌అప్‌, ప్రీపోన్‌మెంట్‌ ఉత్తర్వులు ఇచ్చే అధికారం డ్రాయింగ్‌ అధికారులకే ఉందని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నప్పటకీ నియామక అధికారులే ఇవ్వాలని ట్రెజరీ అధికారులు అభ్యంతరాలు లేవనెత్తడంతో ఉపాధ్యాయుల ఫిక్సేషన్స్‌ నిలిచిపోయాయని ఆర్థిక శాఖ అధికారుల దృష్టికి వారు తీసుకెళ్లారు. అదే విధంగా 6జి(1) రూల్‌ పదోన్నతులతోపాటు ఆటోమేటిక్‌ అడ్వాన్స్‌మెంట్‌ స్కేళ్లకు వర్తింపజేయడంలో ట్రెజరీ అధికారులు లేవనెత్తే అభ్యంతరాలకు క్లారిఫికేషన్‌ ఇవ్వాలని కోరారు. ఆ మేరకు వీటిపై త్వరలో వివరణ ఉత్తర్వులు ఇస్తామని హామీ ఇచ్చినట్లు యుటిఎఫ్‌ నాయకులు తెలిపారు.

ToP
 
 
 
 

PDF
 
 

Copyright © 2008-
A.P.United Teachers' Federation
Mail to : aputf2000@yahoo.com
Home | Ikya Upadhyaya | News | GO's | Statements | STFI | Contact Us