హైదరాబాద్ Sat, 26 Jun 2010:
ఉపాధ్యాయుల అప్రెంటిస్ సర్వీసుకు రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాల్సిన ఫైలు శనివారం సాయంత్రం ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరిందని యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్.నారాయణ, ఐ.వెంకటేశ్వరరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాల్లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి హైదరాబాద్ వచ్చాక ఈ ఫైలుపై సంతకం చేస్తే సోమ లేదా మంగళవారాల్లో ఉత్తర్వులు వచ్చే అవకాశముందని వారు తెలిపారు. యుటిఎఫ్ చేసిన పోరాటాల వల్లనే ఫైలు ముఖ్యమంత్రి పేషీకి చేరిందన్నారు.
పెట్రో ధరల పెంపును నిరసించండి
పెరిగిన పెట్రో ఉత్పత్తుల ధరలకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం నిరసన ప్రదర్శనలు చేపట్టాలని యుటిఎఫ్ పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరింది.