కృష్ణా జిల్లా – సేవా కార్యక్రమాలు

IMG_20200404_191451

కరోనా -19 – సేవా కార్యక్రమాలు

కృష్ణా జిల్లాలో లోని 49 మండల శాఖలు, 2 నగర శాఖలు, 1 పట్టణశాఖ మొత్తం 52 శాఖలలో కోవిడ్‌19 సేవాకార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ది 03.05.2020 నాటికి రూ.25,02,628/ రూపాయలు విరాళములుగా సేకరించడం జరిగింది. 2976 మంది దాతలు విరాళములు ఇవ్వగా, సేవాకార్యక్రమాలలో 430 మంది పాల్గొనగా 12873 మంది కుటుంబాలకు సహాయం అందించడం జరిగింది. భోజన ప్యాకెట్లు, నిత్యావసర సరుకులు, మాస్కులు, శానిటైజర్లు, గ్లౌజులు పంపిణీ చేయడం జరిగింది. వైద్య సిబ్బందికి, పారిశుధ్య కార్మికులకు, పోలీసు సిబ్బందికి, ఆశావర్కర్లకు పండ్లు పంపిణీ చేసి అభినందనలు తెలియజేయడం జరిగింది.
జిల్లాశాఖ పిలుపునందుకొని యుటిఎఫ్‌ మహిళా కార్యకర్తలు తిరువూరు, అవనిగడ్డ, తోట్లవల్లూరు లో మాస్కులు కుట్టి ది 1.05.2020న మేడే సందర్భముగా పంపిణీ చేయడం జరిగింది.
ది.4.4.2020వ తేదీన కృష్ణా జిల్లాలో విజయవాడ భాను నగర్‌లో లాక్‌డౌన్‌ సందర్భముగా ఇబ్బందు పడుతున్న బాధితులకు 200 భోజనపాకెట్లు సరఫరా చేయడం జరిగింది. రాష్ట్ర ప్రధానకార్యదర్శి పి. బాబురెడ్డి వారి శ్రీమతి సుప్రజ గార్లు, రాష్ట్ర కార్యాలయం కంప్యూటర్‌ ఇన్‌ చార్జ్ బి.శిరీష్‌బాబు వారి శ్రీమతి పి. రమాదేవి గార్ల ఆర్ధిక సహాయంతో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. జిల్లాలో ఇదే మొదటి కార్యక్రమం అందరికీ స్ఫూర్తిని నింపిన బి.శిరీష్‌బాబు దంపతులకు ధన్యవాదాలు మరియు అభినందనలు.

ది.5.4.2020వ తేదీన రాష్ట్ర కార్యదర్శి ఎ.కృష్ణసుందరరావు, జిల్లా ప్రధానకార్యదర్శి ఎస్‌.పి.మనోహార్‌కుమార్‌ ఆర్ధిక సహకారంతో విజయవాడ వాంబే కానీలో బాధితులకు 200 భోజనపాకెట్లు సరఫరా చేయడం జరిగింది.
ది06.4.2020వతేదీన సీనియర్‌ కార్యకర్త అడుసుమిల్లి గోపాలకృష్ణ మరియు విజయవాడ రూరల్‌ ప్రధానకార్యదర్శి ఎం.రత్నకమల్‌ బాబు ఆర్ధిక సహకారంతో విజయవాడ లబ్బీపేటలోని అంబేద్కర్‌ కాలనీలో బాధితులకు 200 భోజనపాకెట్లు సరఫరా చేయడం జరిగింది.
ఈ కార్యక్రమాలలో రాష్ట్ర ప్రధానకార్యదర్శి పి.బాబురెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఎ.కృష్ణసుందరరావు, జిల్లా శాఖ ప్రధానకార్యదర్శి ఎస్‌.పి.మనోహర్‌ కుమార్‌, జిల్లా కార్యదర్శి షేక్‌ సైదా సాహెబ్‌, జిల్లాకార్యదర్శి ఎ.సుందరయ్య రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు ఎం.శ్రీనివాస రావు, సిటి గౌరవాధ్యక్షులు మల్లిఖార్జునరెడ్డి, సిటి శాఖ ప్రధానకార్యదర్శి వడ్లమూడి కొండలరావు, కోశాధికారి నాగేశ్వర రావు, అనంత్‌, అనంద్‌, విజయవాడ రూరల్‌ ప్రధానకార్యదర్శి ఎం.రత్నకమల్‌బాబు,జి.కొండూరు శాఖ అధ్యక్షులు భరత్‌, సీనియర్‌ కార్యకర్త ఎ.గోలపాకృష్ణ , షరీఫ్‌, గుంటూరు జిల్లాకార్యదర్శి కె. రవిచంద్ర శేఖర్‌, రాష్ట్ర కార్యాలయం కంప్యూటర్‌ ఇన్‌ చార్జ్ బి.శిరీష్‌ బాబు పాల్గొన్నారు.

పూర్తి సమాచారం:Download

/ Krishna

Share the Post

About the Author

Comments

Comments are closed.

super p force sildenafil 100 mg + dapoxetine 100 mg https://www.topdrugscanadian.com/buy-super-p-force-online/
PHP Code Snippets Powered By : XYZScripts.com